- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Suvendu Adhikari: వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే నీచ రాజకీయాలు.. దీదీకి సువేందు అధికారి కౌంటర్
దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దు భద్రతా దళం(BSF)పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత సువేందు అధికారి(Suvendu Adhikari) మండిపడ్డారు. ఈ మేరకు దీదీకి ఆయన లేఖ రాశారు. ‘భద్రతా దళాలు దేశానికి సేవ చేస్తాయి.. కానీ, ప్రభుత్వానికి కాదు. వారు దేశ రక్షకులు. గత కొద్ది రోజులుగా పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న చొరబాటులకు సైనికులను నిందిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు ఉంటాయి. అయితే, భద్రతా బలగాలను అందులోకి లాగడం వారిని అవమానించడమే అవుతోంది. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న నీచ రాజకీయం తప్ప మరొకటి కాదు. ఇది సీఏపీఎఫ్ఎస్(CAPFS)లోని 75,000 మంది సిబ్బందిని, బీఎస్ఎఫ్ లోని 33 వేల మంది సిబ్బందిని, దేశ సైనికులందరినీ అవమానించడమే. దేశ సరిహద్దులను, ప్రజలను రక్షించడానికి వారు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అలాంటి వారిని అవమానిస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు దేశం మరచిపోదు’ అని లేఖలో పేర్కొన్నారు.
దీదీపై విమర్శలు
సరిహద్దు సంబంధిత అంశాల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఎస్‌ఎఫ్‌కు సహకరించడం లేదని సువేందు అధికారి ఆరోపించారు. "చొరబాటుదారులు భౌగోళిక ప్రతికూలతలను ప్రతికూలతను వాడుకుని మన భూభాగంలోకి ప్రవేశిస్తారు. చొరబాటుదారులు ఒక గ్రామంలో ఉన్నప్పుడు వారికి గుర్తింపు కార్డులను ఎందుకు తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తారు? అధికారులు వారిని పౌరులుగా నిర్ధారించి వారి గుర్తింపు కార్డులను ఎలా జారీ చేస్తారు?" అని ఆయన దీదీని ప్రశ్నించారు. ఇకపోతే, ఇటీవల బంగ్లాదేశ్ (Bangladesh) చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించడానికి బీఎస్‌ఎఫ్ సాయం చేస్తోందని దీదీ ఆరోపించారు. బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలు ఉన్నాయని, భారత్- బంగ్లా సరిహద్దుకు ఇరువైపులా శాంతియుత పరిస్థితులు ఉండాలని వ్యాఖ్యానించారు. దీనిపైనే సువేందు అధికారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.