‘శీను గాడి పుట్టిన రోజు అంటే ఊరు మొత్తం మోత మోగిపోవాల’.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Hamsa |
‘శీను గాడి పుట్టిన రోజు అంటే ఊరు మొత్తం మోత మోగిపోవాల’.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) 2023లో ‘చత్రపతి’ మూవీలో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత ఏడాది పాటు పూర్తిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో ‘భైరవం’(Bhairavam) మూవీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో నారా రోహిత్(Nara Rohit), మంచు మనోజ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. అదితి శంకర్(Aditi Shankar), దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు.

దీనిని శ్రీసత్య సాయి ఆర్ట్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్స్‌పై జయంతిలాల్ గదా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ వరుస పోస్టర్స్ షేర్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, సాయి శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో మాస్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన పూల చొక్కా గుబురు గడ్డంతో లుంకీలో జాతర నుంచి నడుచుకుంటూ వస్తున్నట్లుగా కనిపించాడు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘శీను గాడి పుట్టిన రోజు అంటే ఊరు మొత్తం మోత మోగిపోవాల’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సారి సాయి శ్రీనివాస్ వెరైటీ లుక్‌తో అదరగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.


Advertisement

Next Story

Most Viewed