ఏఈగా వారం క్రితం బాధ్యతలు స్వీకరణ..అంతలోనే మృతి ఒడిలోకి

by Aamani |
ఏఈగా వారం క్రితం బాధ్యతలు స్వీకరణ..అంతలోనే మృతి ఒడిలోకి
X

దిశ,నర్సాపూర్ : నర్సాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మేడలమ్మ గుడి పరిసర ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకెళితే నర్సాపూర్ పంచాయతీరాజ్ శాఖలో ఏఈ గా విధులు నిర్వహిస్తున్న పాప గారి మనిషా రెడ్డి ( 22) ఆఫీస్ కు ఆటోలో హైదరాబాద్ నర్సాపూర్ కు వస్తున్నారు. అలాగే రుస్తుం పేట చెందిన దూడి ఐశ్వర్య హైదరాబాద్ నగరంలో ఇంటర్ చదువుతుంది. సూరారం కు చెందిన మరో వ్యక్తి మొత్తం ముగ్గురు నర్సాపూర్ కు ఆటోలో వస్తున్న క్రమంలో మెదక్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు మేడలమ్మ వద్దకు రాగానే కారు ఆటోను బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఏఈ మనిషా రెడ్డి, దుడి ఐశ్వర్య మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా వెనక ఆటోలో ఉన్న మరో ఆటోలో ఉన్న 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నర్సాపూర్ పట్టణంలోని ఐదో వార్డు చెందిన వీరు హైదరాబాద్ నగరం నుంచి కూరగాయలు తీసుకొని వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఏ ఈ మనీషా రెడ్డి సంగారెడ్డిలో క్వాలిటీ కంట్రోల్ ఏఈ గా పనిచేస్తుండగా డిప్యూటేషన్ పై నర్సాపూర్ పంచాయతీరాజ్ శాఖ ఏఈగా వారం రోజుల క్రితం బదిలీపై వచ్చారు. అంతలోనే మృతి ఒడిలోకి చేరడంతో కుత్బుల్లాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story