- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరింది. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. విభజన చట్టంలో పొందుపర్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలోని రైల్ వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నది. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్‌లో తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గనుల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, గిరిజన శాఖ కార్యదర్శి శరత్, కోఆర్డినేషన్ – గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
పలు అంశాలపై చర్చ
ఢిల్లీలో జరిగిన భేటీలో ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో ఉన్న గిరిజన విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ యూనివర్శిటీల ఏర్పాటు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఎన్‌టీపీసీ సెకండ్ ఫేజ్‌లో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ వంటి అంశాలపై కీలకంగా చర్చించారు. కాజీపేటలోని రైల్ వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రకటించారు. దీనికి సంబంధించిన పనులు 2025 ఆగస్టు వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా త్వరలో కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించే చాన్స్ ఉన్నదని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఎన్‌టీపీసీ నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ పూర్తి కాగా.. సెకండ్ ఫేజ్‌ను త్వరలో ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో అంగీకారం తెలిపింది. అయితే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఫిజిబులిటి లేని కారణంగా దీనిపై మరింత స్టడీ చేయనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
సమ్మక్క, సారక్క యూనివర్సిటీకి వీసీ, సిబ్బంది నియామకంపై హామీ
ములుగులోని సమ్మక్క– సారక్క ట్రైబల్ యూనివర్శిటీకి పర్మినెంట్‌గా వీసీ, సిబ్బందిని నియమించేలా చూడాలని తెలంగాణ అధికారులు కేంద్రాన్ని కోరగా.. సాధ్యమైనంత త్వరగా ట్రైబల్ వర్సిటీ పూర్తి స్థాయిలో నడిచేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. మిగిలిన హామీలనూ త్వరగా నెరవేర్చాలని సీఎస్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు కోరగా... ఇందుకు హోంశాఖ సెక్రెటరీ సానుకూలంగా స్పందించారు.