నానా హైరానా సాంగ్‌తో చరణ్ – ఉపాసన క్యూట్ వీడియో ఎడిట్ చేసిన ఫ్యాన్.. ఉపాసన రిప్లై వైరల్(పోస్ట్)

by Kavitha |   ( Updated:29 Nov 2024 9:50 AM  )
నానా హైరానా సాంగ్‌తో చరణ్ – ఉపాసన క్యూట్ వీడియో ఎడిట్ చేసిన ఫ్యాన్.. ఉపాసన రిప్లై వైరల్(పోస్ట్)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ కూడా రిలీజ్ అయింది. కార్తీక్, శ్రేయ ఘోషల్ పాడిన ‘నానా హైరానా’ సాంగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. తమన్ స్వరాలు సమకూర్చారు.

ఇదిలా ఉంటే.. నానా హైరానా సాంగ్‌తో మెగా ఫ్యాన్స్.. చరణ్, ఉపాసన క్యూట్ మూమెంట్స్‌తో ఒక వీడియో ఎడిట్ చేశారు. చరణ్ – ఉపాసన పాత వీడియోలు తీసుకొని క్యూట్‌గా వీడియో ఎడిట్ చేయడంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉపాసన దాకా వెళ్లడంతో ఉపాసనకు కూడా ఈ వీడియో బాగా నచ్చేసింది. దీంతో ఈ వీడియోకు రిప్లై ఇస్తూ.. ‘ఈ క్యూట్ ఎడిట్ చాలా బాగుంది. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని తెలిపింది. ఉపాసన కూడా ఈ వీడియోకు రిప్లై ఇవ్వడంతో ఇది మరింత హైలెట్ అయింది.

Next Story

Most Viewed