CWC Meeting: నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. ఆ అంశాలపైనే కీలక చర్చ

by Shiva |
CWC Meeting: నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. ఆ అంశాలపైనే కీలక చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ (CWC) ఢిల్లీ (Delhi)లోని హోటల్ అశోకాలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభా పక్ష నాయకులు, పీసీపీ (PCC) ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నారు. ఇక తెలంగాణ (Telangana) నుంచి సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్‌ రెడ్డి సమావేశానికి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు మీటింగ్‌కు అటెండ్ కానున్నారు. మహారాష్ట్ర (Maharashtra), హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) గెలిచేందుకు అవకాశాలు ఉన్నా పార్టీ ఓటిమికి గల కారణాలను విశ్లేషించనున్నారు. ఎక్కడ తప్పు జరిగింది, లోపాలను ఎలా సరిచేయాలనే అంశాలు కూడా చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు.



Next Story

Most Viewed