ఏపీకి తప్పిన ముప్పు.. ఆ జిల్లాకు మాత్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్

by Rani Yarlagadda |
ఏపీకి తప్పిన ముప్పు.. ఆ జిల్లాకు మాత్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారుందన్న హెచ్చరికలు ఏపీ ప్రజలను వణికించాయి. తాజాగా తీవ్రవాయుగుండం వాయుగుండంగా బలహీన పడుతుందని, ఏపీకి తుపాను ముప్పు లేదని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ నేడు, రేపు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కిలోమీటర్లు, నాగపట్నంకు 340, పుదుచ్ఛేరికి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

నేటి సాయంత్రానికి వాయుగుండం బలహీన పడి.. వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయం కరైకల్ (పుదుచ్చేరి), మహాబలిపురం (తమిళనాడు) మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed