- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi Elections: ఓవర్ టు ఢిల్లీ..! ఎన్నికల్లో టీ కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రచారం
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. దేశ రాజధానిలో దాదాపుగా 6 లక్షల మంది వరకు తెలుగు ఓటర్లు ఉన్నారు. వీరు ఎలక్షన్స్‌లో ముఖ్యపాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీతో అక్కడ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మొత్తం 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారు. 70 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన రెండు జాతీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను అక్కడ ప్రచారం చేయించాలనే ఆలోచన చేస్తున్నారు.
దీంతో తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతల పేర్లను ఇవ్వాల్సిందిగా ఆయా పార్టీలకు చెందిన జాతీయ కార్యాలయాల నుంచి సమాచారం అడిగినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు, ఎంపీలు క్యాంపెయిన్‌కు వెళ్లనున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ తదితర నేతలు అక్కడ ప్రచారం చేయనున్నారని సమాచారం. ఈ నెల చివరి వారంలో వీరందరు అక్కడ ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి నిలపనున్నారు. పార్లమెంటు సమావేశాలను ఈ నెలాఖరున ఉన్నందున చివరి వారం నుంచి ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.