తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ చైర్మన్

by Mahesh |   ( Updated:2025-01-09 01:59:08.0  )
తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ చైర్మన్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం బుధవారం టోకెన్లు జారీ చేశారు. ఈ క్రమంలో టోకెన్ల(tokens) కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట(Stampede) జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu) స్పందించి.. విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొక్కిసలాట(Stampede) ఘటనపై అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు(CM చంద్రబాబు) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, పవిత్ర తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. అలాగే డీఎస్పీ(DSP) గేట్లను తెరవడం వలన తొక్కిసలాట జరిగిందని, అలాగే మరికొందరు అధికారుల తప్పిదం వల్లే ఈ దురదృష్టకర ఘటన జరిగిందని బీఆర్ నాయుడు(BR Naidu) ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శిస్తారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం చెప్పారని.. ఈ రోజు మృతుల కుటుంబాలకు పరిహారం(Compensation) ప్రకటిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు. వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్ల దగ్గర తొక్కిసలాట జరగ్గా ఆరుగురు మృతి చెందారు. అలాగే 40 మందికి గాయాలు కాగా వారిని తిరుపతి రుయా ఆస్పత్రి(Ruya Hospital)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయాలైన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అలాగే స్వల్ప గాయాలతో బయటపడినవారు ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటున్నారు.. తొక్కిసలాటలో మృతి చెందిన భక్తులకు రుయాలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అధికారులు అప్పగించనున్నారు.

Advertisement

Next Story