- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వివాదాస్పదంగా భూ కబ్జా..ప్రజాసంఘాల ఫిర్యాదుతో స్పందించిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు
దిశ,కోటగిరి: మండల కేంద్రం బస్టాండ్ సమీపంలోని నిజాం సాగర్ కెనాల్ డీ 28/1/2 కెనాల్ బౌండ్రిలో జరుగుతున్న కబ్జాలు వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో ఎట్టకేలకు సంబంధిత అధికారులు స్పందించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కెనాల్ బౌండ్రీని, కెనాల్ బౌండరీ పరిధిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పరిశీలించారు. జాయింట్ సర్వే చేయడానికి ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు జాయింట్ సర్వేకు పూనుకున్నాయి. విలువైన ఇరిగేషన్ సంబంధిత భూములు కబ్జాకు గురవుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన చేస్తూ ప్రజా సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి.
కెనాల్ బౌండ్రీపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులు ఆదేశించి వదిలేశారు. కానీ, ఆక్రమణ దారులు అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా మిన్నకుండి పోవడంతో ప్రజాసంఘాలు అధికారులపై ఒత్తిడి పెంచాయి. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడటంతో అధికారుల మెడకు ఉచ్చులా బిగుసుకునే ప్రమాదమేర్పడిందని గమనించిన ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో ఆక్రమణలను పరిశీలించారు. కెనాల్ బౌండ్రీలోనే నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని నిర్ధారించుకున్న అధికారులు వాటిని రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బందితో తొలగించే ప్రయత్నం చేస్తుండగా, గ్రామస్తులు, ఆక్రమణ దారులు అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు.
నిజాం సాగర్ కెనాల్ బౌండ్రీని కబ్జా చేస్తున్నారని తాము గత ఎనిమిది నెలల నుంచి ఏఈ సత్యనారాయణకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, ఒక్క దగ్గర ఉన్న కబ్జాలనే తొలగించి మిగతా కబ్జాలను వదిలేస్తే తామెలా ఊరుకుంటామని కొందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. తొలగిస్తే అన్ని ఆక్రమణలను తొలగించాలని పట్టుబట్టారు. ఏదో చర్యలు తీసుకున్నామని చెప్పుకోడానికి ఒకరిద్దరి కబ్జాలను తొలగించి చేతులు దులిపేసుకుంటే ఊరుకునేది లేదని గ్రామస్థులు అధికారులను హెచ్చరించారు. ప్రైవేటు వ్యక్తులు ఫిర్యాదు చేస్తేనే స్పందించే అధికారులు పంట పొలాలకు నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఎస్ బి ఐ ముందు కెనాల్ ను పూర్తిగా మూసివేసిన ప్రదేశాన్ని గ్రామస్తులు అధికారులకు చూపించారు. కొందరు వ్యక్తులు అక్రమంగా కెనాల్ నే మూసేసినా పట్టించుకోని అధికారుల తీరును ఏ విధంగా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించారు. ఇరిగేషన్ డీఈ భూమన్న, మండల తహసీల్దార్ గంగాధర్ లు తమ సిబ్బందితో కలిసి కెనాల్ బౌండరీ రెండు వైపులా పరిశీలించారు. రెండు శాఖల అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తే స్పందించి పట్టించుకుంటే సమస్య ఇక్కడి దాకా వచ్చేది కాదని అధికారులపై మండిపడ్డారు.
సర్వే చేసి నోటీసులు ఇస్తాం : డీఈ భూమన్న
కెనాల్ బౌండ్రి కబ్జాలపై తమకు అందిన ఫిర్యాదుపై తాము స్పందించామని, నిజాంసాగర్ డీ28/1/2 సబ్ కెనాల్ ను స్టార్టింగ్ పాయింట్ నుంచి పరిశీలించామని డీఈ (ఇరిగేషన్) భూమన్న అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపామని, త్వరలోనే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో జాయింట్ సర్వే నిర్వహిస్తామన్నారు. కెనాన్ బౌండ్రిపై నిర్మాణాలు చేపట్టిన వారందరికీ నోటీసులు ఇచ్చి అక్రమ కట్టడాలను తొలగిస్తామన్నారు. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.