- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Allari Naresh: బచ్చలమల్లి చిత్రంపై అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కథ విన్నప్పుడు కళ్లల్లో నీళ్లొస్తాయి!
దిశ, వెబ్‌డెస్క్: సుబ్బు మంగదేవి(Director Subbu Mangadevi) దర్శకత్వంలో డిసెంబరు 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ‘బచ్చలమల్లి’(Bacchalamalli) చిత్రం. అల్లరి నరేష్(Allari Naresh) కథానాయకుడిగా నటిస్తోన్న ఈ మూవీలో అమృత అయ్యర్(Amrita Iyer) హీరోయిన్‌గా నటిస్తుంది. హాస్య మూవీస్ పతాకం(hasya movies pathakam)పై రాజేశ్ దండా(Rajesh Danda).. బాలాజీ గుత్తా(Balaji Gutta) నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న (నవంబరు 28) హైదరాబాదు(Hyderabad)లో టీజర్(Teaser) రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఫొటోగ్రాఫర్ రిచర్డ్(Photographer Richard), నటుడు ప్రసాద్ బెరా(Prasad Bera), కళా డైరెక్టర్ బ్రహ్మ కడలి(Art Director Brahma Kadali), ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్(Editor Chhota K. Prasad), స్క్రీన్ప్లే రచయిత మధు(Madha is the screenplay writer), హీరో అల్లరి నరేష్(Allari Naresh) హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. బచ్చలమల్లి సినిమా మూడేళ్ల జర్నీ అని అన్నారు. డైరెక్టర్ ఈ స్టోరీని ఎంత అద్భుతంగా వివరించాడో.. అంతే చక్కగా రూపొందించారని తెలిపాడు.
ప్రేక్షకులందరూ తప్పకుండా ఈ స్టోరీకి కనెక్ట్ అవుతారని.. తను మాత్రం ఎక్కడా హీరోలా కనిపించనని చెబుతాడు. పాత్ర మాత్రమే కనిపిస్తుందని అన్నాడు. అయితే ఇటీవల చాలా మంది.. అల్లరి నరేష్ సీరియస్ చిత్రాల్లోనే నటిస్తున్నారని అంటున్నారని అన్నారు. కానీ అలాంటిదేమీ లేదని, కామెడీ(Comedy), కంటెంట్(Content).. రెండున్న చిత్రాల్లోనూ నటిస్తున్నానని ఈ సందర్భంగా జనాలకు క్లారిటీ ఇచ్చాడు నరేష్. తర్వాత డైరెక్టర్ మాట్లాడుతూ.. కరోనా టైంలో తన అమ్మ హాస్పిటల్‌లో ఉంటే సరైన సమయంలో వెళ్లలేకపోయానని తెలిపాడు. అక్కడికి వెళ్లేలోపే అదే చివరి చూపు అయ్యిందని.. అదే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పని ఎమోషనల్ అయ్యాడు.
కాగా ఇలాంటి అంశంపై నిజాయితీగా ఓ స్టోరీ చెప్పాలనిపించే బచ్చలమల్లి చిత్రాన్ని తీశానని వెల్లడించాడు. హీరో నరేష్ నన్ను చాలా ఎంకరేజ్ చేశాడని అన్నాడు. చాలా సపోర్ట్ చేశాడని పేర్కొన్నాడు. ఇక అమృత పాత్ర అయితే అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిపాడు. అనంతరం ప్రొడ్యూసర్ మాట్లాడారు. అల్లరి నరేష్ కెరీర్‌లో ఒక ఉత్తమ చిత్రంగా బచ్చలమల్లి సినిమా నిలుస్తుందని పేర్కొన్నాడు. ఈ సినిమా స్టోరీ విన్నప్పుడల్లా నిజంగా కళ్లలో నీళ్లు తిరుగుతాయని అన్నాడు. ఎంతో ప్రేమించి తెరకెక్కించిన చిత్రమిదని వెల్లడించాడు.