- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవాణాశాఖలో పదోన్నతులు.. అధికారులకు మంత్రి పొన్నం కీలక సూచనలు
దిశ, తెలంగాణ బ్యూరో: వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని పదోన్నతి పొందిన అధికారులకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రవాణాశాఖలో డీటీసీలను జేటీసీలుగా, ఆర్టీవోలను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖలో పెండింగ్ లో ఉన్న పదోన్నతులు కల్పించినందుకు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను చేరుకోవాలని సూచించారు.
రహదారి భద్రత ను పెంపొందించడానికి కృషి చేయాలని పదోన్నతి పొందిన అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ కుమార్, తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పదోన్నతులు కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రమాదాల నివారణకు కృషి చేస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రత్యేక చొరవ వల్లనే ఈ పదోన్నతులు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేటీసీగా పదోన్నతి పొందిన శివ లింగయ్య, డీటీసీలుగా పదోన్నతులు పొందిన వాణి, సదానందం, కిషన్, సురేష్ రెడ్డి ఉన్నారు.