ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నాగ చైతన్య, శోభితల హల్దీ ఫంక్షన్ స్టార్ట్.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో

by Kavitha |
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నాగ చైతన్య, శోభితల హల్దీ ఫంక్షన్ స్టార్ట్.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించి వీరి నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశారు. అయితే చైతన్య శోభితల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. ఇక వీరి పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

తాజాగా అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో వీరిద్దరికి ఒకే చోట మంగళ స్నానాలు (హల్దీ ఫంక్షన్) చేయించారు. ఇందులో పెళ్లి కూతురుగా శోభిత ఫుల్ సిగ్గు పడుతూ కనిపించింది. ఇక డిసెంబర్ 4న రాత్రి 8.13 గంటలకు జరిగే వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేశారు. అయితే బ్రాహ్మణ సంప్రదాయంలో దాదాపు 8 గంటల పాటు చైతన్య, శోభితల వివాహం జరగనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ హల్దీ ఫంక్షన్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక దీనిని చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Advertisement

Next Story