జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు

by Sridhar Babu |
జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు
X

దిశ, ఆమనగల్లు : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమనగల్లు సీఐ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రగిరి సత్యరాజు, వజ్రగిరి మధు కలిసి మేడిగడ్డ శివారులో జూలై 20న సోలార్ ప్లాంట్ లో సుమారు రూ.10వేల విలువగల వైర్లు దొంగిలించారని ఫిర్యాదు వచ్చింది. దాంతో కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు. జల్సాలకు డబ్బులు సరిపోక నిందితుల కుటుంబ సభ్యులు జట్టుగా ఏర్పడి దొంగతనాలు చేసి సంపాదించాలని వ్యవసాయ బోరు మోటార్లు దొంగిలించి అందులో ఉన్న కాపర్ వైర్లు అమ్మి వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునే వారు.

ఇలా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో సోలార్ కరెంటు తయారయ్యే ప్లాంట్లలో కాపర్ వైరు చోరీ చేసేవారు. జూలై నెలలో మేడిగడ్డ శివారులో గల సోలార్ ప్లాంట్ లో రూ 10 వేల విలువగల వైరు దొంగిలించారు.మంగళవారం నిందితులు పట్టణ కేంద్రంలోని సేవాలాల్ గుట్ట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్నారు. నిందితులని విచారించగా ఈ ముఠా గతంలో మొత్తం తొమ్మిది దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని, మిడ్జిల్ పీఎస్ పరిధిలో నాలుగు, కల్వకుర్తి, అడ్డకల్, చిన్న చింతకుంట, మక్తల్ పీఎస్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆమనగల్లు, తలకొండపల్లి ఎస్సైలు వెంకటేష్, శ్రీకాంత్, కానిస్టేబుల్ శివకుమార్, రఘు, జాషువాలను సీఐ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed