Madhukar Naik : పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం

by Aamani |
Madhukar Naik : పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం
X

దిశ, కంటోన్మెంట్ : పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలు అమోఘమని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ అన్నారు. మంగళవారం కంటోన్మెంట్ బోర్డు వర్క్ షాప్ లో స్వచ్చత హీ సేవా-2024 కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కార్మికులకు వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఈఓ మధుకర్ నాయక్ మాట్లాడుతూ..కార్మికుల కృషి వల్లనే కంటోన్మెంట్ పరిశుభ్రంగా ఉంటుందన్నారు.పౌరుల సేవలో కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.

కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కంటోన్మెంట్ బోర్డు కట్టుబడి ఉందని తెలిపారు. జాయింట్ సిఈఓ పల్లవి విజయ వంశీ మాట్లాడుతూ..కార్మికులు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉచిత వైద్యారోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటిండెంట్ దేవేందర్,కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు సత్కారం..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో బీజేపీ ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. శాలువాతో వారిని సత్కరించి, వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్, బోర్డు నామినేటెడ్ సభ్యుడు జె.రామక్రిష్ణ, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటిండెంట్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed