Roti Kapada Romance: ‘ఆ చిత్రం బాలేదని ఒక్కరన్నా సినిమాలకే రిటైర్‌మెంట్ ఇస్తా’.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |
Roti Kapada Romance: ‘ఆ చిత్రం బాలేదని ఒక్కరన్నా సినిమాలకే రిటైర్‌మెంట్ ఇస్తా’.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: విక్రమ్‌ రెడ్డి(Director Vikram) దర్శకత్వం వహించిన ‘రోటీ కపడా రొమాన్స్’() చిత్రం ఈ నెల (నవంబరు)28 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు హైదరాబాదు(Hyderabad)లోని విలేకర్లతో ముచ్చటించాడు. తన ఫ్రెండ్స్‌ లైఫ్‌లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల్ని ఆధారం చేసుకున ఈ స్టోరీ రాసుకున్నానని వెల్లడించాడు. ఈ చిత్రంలో నాలుగు లవ్ స్టోరీస్ ఉంటాయని, నలుగురి మగాళ్ల లైఫ్‌లోకి అమ్మాయిలు వచ్చాక తమ జీవితాలు ఎలా మారుతాయి? లవ్ లో ఫెయిల్ అయ్యాక వారు ఏం తెలుసుకున్నారు? అనేది సినిమా కథాంశం అని విక్రమ్ రెడ్డి తెలిపాడు. చివరి 15 నిమిషాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందని, లిమిట్స్ దాటి రొమాన్స్ ఏమాత్రం కనిపించదని పేర్కొన్నాడు.

ఈ సినిమా ముందుగా దిల్ రాజు(Dil rāju) తీద్దామని అనుకున్నారన్నాడు. కానీ పలు మార్పులు చేయడం వల్ల స్టోరీపై ఎఫెక్ట్ చూపుతుందని, దీంతో అంగీకరించలేదని అన్నాడు. ఈ విషయాన్ని ఆయన కూడా స్వాగతించారని తెలిపాడు. అంతేకాదు.. ఈ చిత్రానికి టైటిల్ కూడా దిల్‌రాజ్ ఇచ్చాడని వెల్లడించాడు. రోటీ కపడా రొమాన్స్(Roti Kapada Romance) సినిమా విడుదలై.. మల్టీప్లెక్స్‌లు మాస్ థియేటర్లు అవుతాయన్నాడు. ఈ మూవీ తప్పకుండా ఈ తరం యువతకు నచ్చుతుందని..మంచి రొమాంటక్ ఎంటర్‌టైనర్(A romantic entertainer) అని వివరించాడు. సినిమా వీక్షించాక బాలేదని ఒక్కరన్నా కూడా సినిమాలకే రిటైర్‌మెంట్ ఇస్తానని అన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ రెడ్డి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed