Narayanapet: విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్.. మాగనూరులో 144 సెక్షన్ విధింపు

by Gantepaka Srikanth |
Narayanapet: విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్.. మాగనూరులో 144 సెక్షన్ విధింపు
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట(Narayanapet) జిల్లా మాగనూరు(Maganur)లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో బుధవారం పలువురు విద్యార్థి సంఘాట నేతలు జెడ్పీ పాఠశాల(ZP School) సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాల వద్ద భారీగా మోహరించారు. ఇప్పటికే పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్(Section 144) విధించారు. ఇదిలా ఉండగా.. మధ్యాహ్న భోజనం(Madhyahna Bhojanam) వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed