Gautam Adani: గౌతమ్, సాగర్ లపై వస్తున్న కథనాలు తప్పు.. అదానీ గ్రీన్ ఎనర్జీ కీలక ప్రకటన

by Shamantha N |
Gautam Adani: గౌతమ్, సాగర్ లపై వస్తున్న కథనాలు తప్పు.. అదానీ గ్రీన్ ఎనర్జీ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: లంచం ఆరోపణలపై అమెరికాలో ప్రముఖవ్యాపారవేత్త గౌతమ్ అదానీపై కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. అయితే, ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్(Adani Group) నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ కీలక ప్రకటన చేసింది. అదానీ, దాని అనుబంధ సంస్థలు.. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు పెద్దఎత్తున లంచాలు ఆఫర్‌ చేశారన్న ఆరోపణల్లో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ పేర్లు లేవంది. వారిద్దరిపై లంచం అభియోగాలు నమోదైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. ఈమేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌ సందర్భంగా అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (Adani Green Energy Ltd) దీనిపై స్పందించింది. ‘‘అమెరికా ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (FCPA) కింద గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్‌, కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ వినీత్ జైన్‌పై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్లు వచ్చిన కథనాలను తప్పు. అవన్నీ అవాస్తవం. వీరంతా సెక్యూరిటీస్‌ సంబంధించిన మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప వారిపై లంచం, అవినీతి అభియోగాలు ఏవీ నమోదు కాలేదు. ఎఫ్‌సీపీఏ నిబంధనలు ఉల్లంఘించారని అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో ఈ ముగ్గురు పేర్ల ప్రస్తావన లేదు’’ అని అదానీ గ్రీన్‌ పేర్కొంది.

లంచం ఆరోపణలు

గౌతమ్ అదానీ, సాగర్‌ అదానీతో పాటు ఆరుగురు 2020-24 మధ్య కాలంలో భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్‌ డాలర్ల (రూ.2,200 కోట్ల) లంచాలు ఇచ్చేందుకు అంగీకరించారని న్యూయార్క్‌ కోర్టులో వారిపై నేరారోపణ నమోదైంది. సోలార్ పవర్ సప్లయ్ ఒప్పందాలు పొందేందుకే లంచం ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌లు గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ, అజూర్‌ పవర్‌ గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ సిరిల్‌ కాబనేస్‌లపై యూఎస్‌ ఎస్‌ఈసీ అభియోగాలు మోపింది. ఈక్రమంలోనే ఇటీవల గౌతమ్‌, సాగర్‌కు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ సమన్లు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. ఈ కేసుల్లో న్యాయపరంగానే ముందుకు వెళ్తాని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed