ఎట్టకేలకు నాగ చైతన్య, శోభిత పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన టీమ్.. అవన్నీ అవాస్తవం మాత్రమే అంటూ..

by Kavitha |
ఎట్టకేలకు నాగ చైతన్య, శోభిత పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన టీమ్.. అవన్నీ అవాస్తవం మాత్రమే అంటూ..
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించి వీరి నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశారు. అయితే చైతన్య శోభితల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. ఇక వీరి పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈలోపే నాగార్జున మరో గుడ్ న్యూస్ చెప్పారు. అక్కినేని అఖిల్ కూడా తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో అఖిల్, జైనాబ్‌ల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. నాగ చైతన్య, శోభితల పెళ్లిని ఓటీటీలో విడుదల చేస్తారని పలు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెలబ్రిటీల పెళ్లిళ్లు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అలాగే నాగ చైతన్య శోభిత పెళ్లి కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా దీనిపై సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చారు. నాగ చైతన్య, శోభిత పెళ్లి ఓటీటీలో విడుదల చేయడం లేదని అంటున్నారు. చైతన్య, శోభిత పెళ్లిపై వస్తున్న రూమర్స్ అవాస్తవం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story