Rahu Effects: రాహు నక్షత్ర సంచారం.. ఆ రాశుల వారికీ గుడ్ టైం స్టార్ట్..!

by Prasanna |
Rahu Effects: రాహు నక్షత్ర సంచారం.. ఆ రాశుల వారికీ గుడ్ టైం స్టార్ట్..!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహాన్ని( Rahuvu ) అశుభంగా పరిగణిస్తారు. ఈ గ్రహం 18 నెలకొకసారి రాశి సంచారం చేస్తుంది. 2023 లో అక్టోబర్ నెలలో మీనరాశిలోకి ప్రవేశించింది. అయితే, అప్పుడు ఈ రాహు గ్రహం నక్షత్ర సంచారం కూడా చేసింది. ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు వేగంగా కదులుతూ ఉంది. దీని ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. వాటిలో రెండు రాశుల వారికీ శుభముగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభ రాశి

రాహు నక్షత్ర సంచారం వలన వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. రాహువు అనుగ్రహంతో కొత్త భూమిని కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. వ్యాపారాల్లో ఇబ్బంది పడుతున్న వారికీ మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాశి వారి వైవాహిక జీవితం అద్భుతంగ ఉంటుంది.

మిథున రాశి

రాహు నక్షత్ర సంచారం వలన మిథున రాశి వారికి మంచిగా ఉంటుంది. కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి.అలాగే, వీరికి రాహు అనుగ్రహంతో మంచి ఉద్యోగం సంపాదిస్తారు. వ్యాపారాలు చేస్తున్న వారికీ ఈ సమయం కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టిన రెట్టింపు లాభాలు వస్తాయి. అలాగే, ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed