- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చిన్న కాళేశ్వరంకు నిధులు మంజూరు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
దిశ, కాటారం : వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 571 కోట్లు నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. భూసేకరణ అభివృద్ధి పనుల నిధుల కోసం ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వివరించారు. గోదావరి నది పై గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించినట్లు ప్రారంభమైన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం హాయంలోనే 571 కోట్ల నిధులు మంజూరయ్యారని గత నాలుగు రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భూసేకరణ అభివృద్ది కాటారం డివిజన్ పరిధిలో ఐదు మండలాల్లోని 45 వేల ఎకరాల బీడు కాటారం డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో 45 వేల ఎకరాల బేలు భూములకు గోదావరి జలాలతో సాగు, తాగునీటిని అందించేందుకు పనుల నిధుల కోసం సమీక్ష నిర్వహించినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
చిన్న కాళేశ్వరం అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు విషయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రశ్నించగా కాళేశ్వరం నీటి పథకం పై గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూ. 571 కోట్లు నిధులు మంజూరయ్యారని, చిన్న కాళేశ్వరం అభివృద్ధి కోసం భూసేకరణ కోసం గత రెండుకు రోజుల క్రితం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నిధులు కోసం సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాదిలోగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 45 వేల ఎకరాలకు నీరు అందించే సమీక్ష నిర్వహించామని అందుకోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి పనులు పూర్తి చేసేందుకు సహకిరిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. చిన్న కాళేశ్వరం పథకం ద్వారా కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని చెరువులను నింపి రెండు పంటలకు నీళ్లు అందించే కార్యక్రమం చేపట్టేందుకు కృషి చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.