- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ISKCON: ఇస్కాన్ ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఇస్కాన్ (ISKCON)కు చెందిన చిన్మయి కృష్ణదాస్ ప్రభు (Chinmoy Krishnadas) అరెస్టయ్యారు. ఢాకా ఎయిర్ పోర్టులోనే ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, అక్కడి హిందువుల భారీగా నిరసనలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ మరో కీలక పరిణామం జరిగింది. ఇస్కాన్‌ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలైంది. ఈ విషయాన్ని ఢాకా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై దృష్టిసారిస్తున్నట్లు కూడా పేర్కొన్నాయి. బంగ్లాలోని శాంతిభద్రతల పరిస్థితిపై గురువారం ఉదయంలోగా నివేదించాలని అటార్నీ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. కాగా, అక్కడి పరిస్థితులు క్షీణించకుండా చూడాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.
చిన్మయి కృష్ణదాస్ అరెస్టు
ఇకపోతే, ఇస్కాన్‌కు చెందిన చిన్మయి కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అయితే, ఆ సమయంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు కృష్ణదాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ పలు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చిన్మయి అరెస్టు కావడంతో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికావని అక్కడి అధికారులను కోరింది.