- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దిశ, సత్తుపల్లి : రైతుల సంక్షేమానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మంత్రి సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ తో కలిసి ఆయన పలు రోడ్డు నిర్మాణాలు, సింగరేణి, వ్యవసాయ గోదాంల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, కో ఆపరేటివ్ సొసైటీ, జీపీ భవనాలను ప్రారంభించారు. బుగ్గపాడు గ్రామంలో బుగ్గపాడు ఆర్ అండ్ బీ రోడ్డు నుండి నాగుపల్లి ఆర్ అండ్ బీ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణ పనులకు, కాకర్లపల్లి గ్రామంలో బీటీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ గ్రామంలో నిర్మించిన కోపరేటివ్ సొసైటీ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కొత్తగూడెం- పాల్వంచ ప్రాంతంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఈ నెలలో బృందం పర్యటన కూడా ఉంటుందని అన్నారు. పొలాలకు నీరు, పిల్లలకు చదువు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిందని అన్నారు. బేతుపల్లి కాలువ తన హయాంలోనే పూర్తి చేశామని, వేంసూరు మండలం నేడు పచ్చగా తయారైందని అన్నారు. నియోజకవర్గంలో కొత్త వ్యవసాయ సహకార సంఘాలు అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సహకార సొసైటీలను బలోపేతం చేసి యంత్ర సామాగ్రి కూడా అందిస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, రైతు బీమా కింద రూ.3 వేల కోట్లు, రైతు బంధు కింద రూ.7600 కోట్లు అందించారని అన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో దాదాపు రూ.10 వేల కోట్లు జమ చేయబోతున్నామని చెప్పారు. రాబోయే పంట సీజన్ నుంచి రైతులకు పూర్తి స్థాయిలో పంట బీమా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం మొదటి సంవత్సరం దాదాపు 40 వేల కోట్లు ఖర్చు చేశామని, మార్చి లోపుల మరో రూ.10 వేల కోట్లు రైతు పథకాల కోసం ఖర్చు పెడతామని అన్నారు.
అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ కాకర్లపల్లి గ్రామంలో బీటీ రోడ్డు, సహకార సంఘం భవనం నేడు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారని, త్వరలో యాతాలకుంట వద్ద టన్నెల్ పూర్తి చేసుకుంటే సత్తుపల్లి, వేంసూరు మండలాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు అభివృద్ధి పనుల కోసం డీఎంఎఫ్టీ నిధులు, రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాం, పొలాలకు వెళ్లే దారులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం సత్తుపల్లి మండలానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాలలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, కల్లూరు ఆర్డీఓ ఎల్. రాజేందర్, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మండల తహసీల్దార్ యోగేశ్వర రావు, సొసైటీ అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులు, సత్తుపల్లి పట్టణ, మండల ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.