- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది: అనిల్ రావిపూడి
దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi), మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్‌లో వస్తున్న మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury), ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) విలేకరుల సమావేశంలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘వెంకటేష్ గారితో చేసిన ఎఫ్2 పొంగల్‌కి వచ్చి పెద్ద విజయం సాధించింది. ఎఫ్3 కూడా పొంగల్‌కి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. ఈసారి చేసే సినిమా ఎలాగైనా పొంగల్‌కి తీసుకొస్తే బావుటుందని ఓపెనింగ్ అప్పుడే సంక్రాంతికి రావాలని అనుకున్నాం.
ఈ కథ ఒక రేస్క్యు ఆపరేషన్‌కి సంబంధించింది. సెకండ్ హాఫ్‌లో నాలుగు రోజులు జర్నీ సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. అయితే కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి గొప్పగా తీయగానే సరిపోదు. థియేటర్స్‌కు జనాలు రాకపోతే రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన చిత్రం వారి అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం. అందుకే ఈసారి సోషల్ మీడియా(Social Media)పై ఎక్కువ ఫోకస్ చేశాం. వెంకటేష్ గారు లాంటి పెద్ద స్టార్ దిగి సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్‌కు చాలా హెల్ప్ అయ్యింది. డెఫినెట్‌గా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చారు.