Trending: చీరకట్టుతో ఆర్టీసీ బస్సు ఎక్కి దివ్యాంగుల నిరసన.. అసలు విషయం ఇదే!

by Shiva |   ( Updated:2024-11-27 07:44:27.0  )
Trending: చీరకట్టుతో ఆర్టీసీ బస్సు ఎక్కి దివ్యాంగుల నిరసన.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ సర్కార్ (Congress Government) మహిళలు ఆర్టీసీ బస్సు(RTC Bus)ల్లో ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకాన్ని (Mahalakshmi Scheme) విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆటోల్లో వెళ్లే వారంతా నిత్యం ఆర్టీసీ బస్సుల్లోనే ఫ్రీగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) అమల్లోకి వచ్చిన నాటి నుంచి బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పురుషులకు సీట్లు లేకుండా పోతుండటంతో వారు నిలబడే ప్రయాణం చేస్తున్నారు. ఇక దివ్యాంగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా (Warangal)లో దివ్యాంగులు వినూత్న నిరసన చేపట్టారు. వర్ధన్నపేట (Vardhannapet) పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో మహిళలకు కూర్చొని ప్రయాణిస్తున్నారని ఆరోపించారు. వారి వల్ల ఆర్టీసీ బస్సు ఎక్కని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. అందుకే తమకు బస్సులో 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. చీర కట్టుకుని నిరసన తెలిపామని దివ్యాంగులు పేర్కొన్నారు.

Advertisement

Next Story