- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV: రాంగోపాల్‌వర్మపై తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదు
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై కేసులు నమోదవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వ్యూహం (Vyuham) సినిమా ప్రమోషన్స్ చేసేటపుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపింది. ఒంగోలులో ఆయనపై కేసు నమోదవ్వగా.. ఇటీవలే ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకపోవడంతో.. అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆర్జీవీ విచారణకు సహకరించకపోతే.. తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు సైతం హెచ్చరించారు.
తాజాగా మళ్లీ ఆర్జీవీ అజ్ఞాతంలో ఉన్నవారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రెండ్రోజులుగా ఆయన హైదరాబాద్ లో లేకపోవడంతో.. 6 పోలీస్ బృందాలు ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయి. ఆర్జీవీ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా.. నిన్న రాత్రి ఆర్జీవీ.. తానెవ్వరికీ భయపడి దాక్కోలేదంటూ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.