- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rashmika Mandanna: బాధతో బాగా ఏడ్చేశాను.. వారందరినీ మిస్ అవుతానంటూ రష్మిక ఎమోషనల్ నోట్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna), అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దీనిని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, రష్మిక ఓ ఎమోషనల్ నోట్(Emotional note) షేర్ చేసింది. షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుపుతూ పలు విషయాలను పంచుకుంది. ‘‘నవంబర్ 25న నా జీవితంలో ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న రోజు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.
24వ తేదీ సాయంత్రం మేమంతా ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నై ఈవెంట్‌కు హాజరయ్యాం. అదే రోజు మళ్లీ హైదరాబాద్(Hyderabad)కు వచ్చాము. ఇంటికి వెళ్లి దాదాపు నాలుగు గంటలు నిద్ర పోయాను. అంతే ఉదయాన్నే నిద్ర లేచి షూట్‌కు వెళ్లిపోయాను. ఈ సినిమాకు ఇదే నా చివరి రోజు షూట్. స్పెషల్ సాంగ్(Special song) చేశాం. రాత్రి వరకు అక్కడే ఉన్నా ఆఖరి రోజు మాత్రం అనిపించలేదు. గత ఐదేళ్లుగా సెట్‌లోనే గడిపాను.
కాబట్టి అది నాకొక ఇల్లులా మారిపోయింది. ఇప్పటి వరకు పడిన కష్టానికి చివరి రోజు కావడంతో అన్ని విషయాలు నా కళ్ల ముందు మెదిలాయి. ఓవైపు బాధ, మరోవైపు ఆనందం. అన్ని రకాల భావోద్వేగాలతో నా మనసు నిండిపోయింది. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరినీ ఇక నుంచి మిస్ అవుతాను. ఎంతో కాలం తర్వాత ఈ రోజు బాధతో బాగా ఏడ్చాను. నేనెందుకు అలా చేశానో అర్థం కాలేదు’’ అని రాసుకొచ్చింది.