- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ మిషన్..
దిశ, పిట్లం : మండలంలోని గోధుమేగామ్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ నడుస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రజావాణిలో సైతం ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అధికారులు దాని పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. గోధుమేగామ్ గ్రామస్తులతో పాటు, కారేగం గ్రామానికి చెందిన పలువురు సైతం ఈ క్రషర్ పై అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ పట్టించుకోకపోవడం లేదని వారు తెలిపారు.
స్టోన్ బ్లాస్టింగ్ లతో పాటు దాని నుంచి వెలువడుతున్న దుమ్ము, దూలితో వాయు కాలుష్యం ఏర్పడుతుందని దీంతో పలువురు అనారోగ్య బారిన పడుతున్నట్లు వారు అన్నారు. విచ్చలవిడి నడుస్తున్న గూడ్స్ వాహనాలతో రాత్రి పగలు అని తేడా లేకుండా రవాణా చేయడంతో దాని ద్వారా ఏర్పడిన దుమ్ముతో ప్రజలు ఆస్తమా బారిన పడే ప్రభావం ఉన్నట్టు వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు క్వశ్చన్ మిషన్ యజమాని పై చర్యలు గ్రామస్తులు కోరుతున్నారు.