Fengal Cyclone: భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

by Rani Yarlagadda |   ( Updated:2024-11-27 07:44:08.0  )
Fengal Cyclone: భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. నేటి సాయంత్రానికి ఇది తుపానుగా మారనుండగా.. దానికి ఫెంగల్ గా నామకరణం చేసింది ఐఎండీ. తుపాను ప్రభావంతో.. ఏపీ, తమిళనాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తమిళనాడు సర్కార్ అప్రమత్తమైంది. 5 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం చేపట్టారు. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో.. తమిళ సర్కార్ ఫ్లడ్ రిలీఫ్ క్యాంపుల ఏర్పాటుపై దృష్టి సారించింది. కాగా.. తుపాను ప్రభావంతో.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, శుక్రవారం (నవంబర్ 29) వరకూ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణశాఖ.

Advertisement

Next Story