Janasena: రాజ్యసభకు నాగబాబు.. అధికారిక ప్రకటనే ఆలస్యం!

by Gantepaka Srikanth |
Janasena: రాజ్యసభకు నాగబాబు.. అధికారిక ప్రకటనే ఆలస్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి నేతల్లో రాజ్యసభ(Rajya Sabha) రేసు మొదలైంది. ముగ్గురు సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో కూటమి పార్టీల మధ్య వేడి రాజుకున్నట్లు తెలుస్తోంది. మూడు సీట్లను మూడు పార్టీలు సమానంగా పంచుకుంటాయా? లేక బలా బలాల ప్రకారం ముందుకు వెళ్తారా? అనే అంశం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. మూడు స్థానాల్లో ఒకటి జనసేన(Janasena) పార్టీకి దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా రెండింట్లో రెండూ టీడీపీనే తీసుకుంటుందా? లేక బీజేపీ నేతల్లో ఒకరికి అవకాశం ఇస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

పదవి ఆశిస్తున్న వారిలో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, సానా సతీష్‌‌లు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇక జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన నుంచి నాగబాబుకు ఆల్మోస్ట్ పదవి ఫైనల్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు నాలుగేళ్లు, ఒకటి రెండేళ్ల పదవీకాలం మాత్రమే ఉండటం గమనార్హం.

Advertisement

Next Story