- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ప్రియాంకపై భక్తుల తీవ్ర ఆగ్రహం
దిశ, సినిమా: జానకి కలగనలేదు, మౌన రాగం వంటి సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ధారావాహికల్లో తన అందం, అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియెన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో కూడా అడుగు పెట్టింది. అక్కడ తన గేమ్స్‌తో మెప్పించి ఏకంగా టాప్-5లో నిలిచింది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అందరికీ పరిచయం చేసిందీ అందాల తార. గత కొన్నేళ్లుగా వీరిద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక ప్రియాంక నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన లవర్‌తో కలిసి తరచూ ఫ్రాంక్ వీడియోలు చేస్తుంటుంది. వాటిని తన యూట్యూబ్ ఛానెల్ నెవర్ ఎండింగ్ టేల్స్‌లో అప్ లోడ్ చేస్తుంటుంది. అలా తాజాగా తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది ప్రియాంక.
అయితే అక్కడ ఈ లవ్ బర్డ్స్ ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక. చిరుత పులి వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. అనంతరం ‘తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్? అంటూ షాకింగ్ అయిన ఫొటోలతో వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. అయితే ‘చివరికి చిరుత లేదు.. అదంతా ఫ్రాంక్’ అంటూ తమ అందరినీ ఫూల్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారందరూ పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటని ప్రియాంక పై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. కేవలం వ్యూస్ కోసం, తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.