IndiGo: బంపర్ ఆఫర్ ప్రకటించిన దేశీయ దిగ్గజ బడ్జెట్ విమానయాన సంస్థ.. టికెట్ బుకింగ్స్‌పై 4 నెలలు ఫ్రీ!

by Anjali |
IndiGo: బంపర్ ఆఫర్ ప్రకటించిన దేశీయ దిగ్గజ బడ్జెట్ విమానయాన సంస్థ.. టికెట్ బుకింగ్స్‌పై 4 నెలలు ఫ్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో(airline IndiGo) తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండిగో కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పటికే ఫ్రీ లగేజీ(Free luggage) అని, విదేశాలకెళ్లే విద్యార్థుల కోసం డిస్కౌంట్ లాంటి ఆఫర్ పెట్టిన విషయం తెలిసిందే. ఇండిగో విమాన టికెట్ల(tickets)పై ఆరు శాతం డిస్కౌంట్ ఇస్తుంది. అంతేకాకుండా ఎక్ట్స్రా 10 కిలోల వరకు ఫ్రీ బ్యాగేజీ(Free baggage) సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇప్పుడు దేశీయ(domestic), అంతర్జాతీయ ప్రయాణికుల(International travelers) కోసం మరో కొత్త ఆఫర్ తీసుకొచ్చింది.

మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ స్పాటిఫై(Media streaming platform Spotify)తో భాగస్వామ్యం ఏర్పర్చుకుంది. ఇప్పటినుంచి టికెట్లు బుక్ చేసుకునే వారికి స్వాటఫై ప్రీమియం మెంబర్‌షిప్ ట్రయల్ ప్లాన్(Membership trial plan) ఫ్రీగా పొందవచ్చు. స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్(Subscription) నాలుగు నెలల పాటు ఫ్రీగా పొందొచ్చని ఇండిగో ఎయిర్ లైన్స్(Indigo Airlines) వెల్లడించింది. తద్వారా పాడ్‌క్యాస్టులు(Podcasts), మ్యూజిక్(Music), ఆడియో పుస్తకాలు(Audio books) వంటివి స్ట్రీమింగ్ మీడియాను ప్రయాణికులు ఫ్రీగా వాడుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఈ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్(Free subscription) కోసం స్పాటిఫైతో ఒప్పందం కుదుర్చుకుంటుంది.

అయితే ఈ అవకాశం ఇండిగో మొబైల్(Indigo Mobile) ద్వారా లేకపోతే ఇండిగో అఫిషీయల్ వెబ్‌సైట్(Official website) ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి ఉంటుంది. అలాగే దేశీయ విమానాలు, ఇంటర్నేషనల్ విమానాల(International flights)కు టికెట్లు బుక్(Book tickets) చేసుకున్న వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ వచ్చే ఏడాది(2025) అక్టోబరు(October) 3 వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటుందని ఇండిగో వెల్లడించింది.

Advertisement

Next Story