- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sobhita Dhulipala: శోభిత గోల్డెన్ లెగ్ అంటూ ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అక్కినేని ఫ్యాన్స్
దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగార్జున ( Nagarjuna Akkineni) ఫ్యాన్స్ కు నాగ చైతన్య పెళ్లికి ముందే మరో బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్ చెప్పేశారు. అక్కినేని అఖిల్ కు (Akhil Akkineni) , జైనబ్ రవ్జీ తో( Zainab Ravdjee) ఎంగెజ్మెంట్ జరిగిందని, వారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అని సినీ వర్గాల వారు చెబుతున్నారు. జైనబ్ తండ్రి జుల్ఫీ రవ్జీకి, నాగార్జునకు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందంట. ఈ నేపథ్యంలోనే వీరి ఎంగెజ్ మెంట్ చాలా సింపుల్ గా జరిపించారు.
అక్కినేని నాగచైతన్య, శోభితాల ఎంగెజ్ మెంట్ అయిన రోజు నుంచి ఏదోకటి జరుగుతూనే ఉందని శోభిత గురించి అందరూ ఏదోకటి మాట్లాడుతూనే ఉన్నారు. మంత్రి కొండా సురేఖ.. నాగార్జున ఫ్యామిలీ గురించి వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రోలర్స్ మాత్రం.. శోభితను ఐరన్ లెగ్ అని.. ఆమె వల్లే.. ఇదంతా జరిగిందని అన్నారు.
ఇప్పుడు కట్ చేస్తే, అఖిల్, జైనబ్ రవ్జీల ఎంగెజ్ మెంట్ ప్రకటించడంతో.. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.శోభితను కూడా తెగ పొగిడేస్తున్నారు. ఆమె అక్కినేని కుటుంబంలో అడుగుపెడుతున్న వేళ.. నాగార్జున ఫ్యామిలీలో ఇంకో శుభకార్యానికి శ్రీకారం చుట్టిందని శోభితను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.