- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Age Based Walking : ఏజ్‌ను బట్టి రోజూ ఈ పని చేయండి..! మీలో వచ్చే సానుకూల మార్పులివే..
దిశ, ఫీచర్స్ : మీరు హెల్తీగా, ఫిట్‌గా ఉండాలంటే డైలీ ఏదో ఒక వ్యాయామం తప్పక చేయాల్సిందే. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అయితే ఇవన్నీ జరగాలంటే కచ్చితంగా జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం నడక ద్వారా కూడా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అయితే రోజుకు ఎంత సేపు వాకింక్ చేయాలి? ఏ వయస్సు వారు ఎన్ని గంటలు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
18 నుంచి 30 ఏండ్ల లోపు
మీరు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు వారైతే రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఈ ఏజ్‌లో ఎనర్జీ లెవల్స్ కూడా బాగుంటాయి. కండరాలు అన్ని రకాలుగా సహకరిస్తాయి. కాబట్టి గంటకు తగ్గకుండా కూడా వాకింగ్ చేయవచ్చు. దీనివల్ల అధిక బరువు సమస్య రాకుండా ఉంటుంది. పైగా గుండె ఆరోగ్యానికి మంచిది.
31 నుంచి 50 ఏండ్ల లోపు
కొందరు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిస్తుంటారు. అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఇతర వ్యాయామాలు చేయకపోయినా.. కనీసం వాకింగ్ మాత్రం కంటిన్యూ చేయాలంటున్నారు. అయితే 31 నుంచి 50 ఏండ్లలోపు వయస్సు వారు రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడిస్తేనే మంచిది. దీనివల్ల కండరాల బలహీనత రాకుండా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
51 నుంచి 65 ఏండ్ల లోపు
51 నుంచి 65 ఏండ్లలోపు వారికి వయస్సు రీత్యా ఇతర వ్యాయామాలు కష్టం కావచ్చు. అయినా వాకింగ్ చేయడం మాత్రం తప్పనిసరి అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. రోజూ కనీసం 30 నిమిషాల నడక ఈ ఏజ్‌లో ఎంతో మేలు చేస్తుంది. బోన్స్ దృఢంగా, ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగు పడుతుంది. మధుమేహం, అధిక బరువు వంటివి నియంత్రణలో ఉంటాయి.
65 ఏండ్లు పైబడితే..
మీ వయస్సు 65 ఏండ్లు పైబడితే కూడా వాకింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రోజుకు కనీసం 25 నిమిషాలు నడిస్తే మెంటల్ హెల్త్ బాగుటుంది. ఇక 75 ఏండ్లు పైబడిన వారు కూడా రోజుకు 15 నిమిషాలు వాకింగ్ చేయాలి. దీనివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ ఏజ్‌లో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తగినంతగా నీరు తాగడం, వాకింగ్ షూలు ధరించడం, శరీరాన్ని సమతుల్యంగా ఉంచే ఆహారాలు లేదా పానీయాలు తీసుకోవడం వంటివి తప్పక చేయాలి. ఏజ్‌ను బట్టి రోజూ నిర్ధారిత వ్యాయామాలు లేదా నడక కొనసాగించడంవల్ల మానసిక, శారీరక ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.