రాజకీయ దుమారం రేపుతున్న జీవన్ రెడ్డి కామెంట్స్

by Sridhar Babu |
రాజకీయ దుమారం రేపుతున్న జీవన్ రెడ్డి కామెంట్స్
X

దిశ, జగిత్యాల టౌన్ : కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్ నువ్వు అక్కడే ఉంటే నేనే మీ పార్టీ (బీఎస్పీ)లోకి వద్దామని అనుకున్నా అంటూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు పొలిటికల్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకల్లో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతకాలం క్రితం బీఎస్పీ నుండి కాంగ్రెస్​లో చేరిన విజయ్ ను ఉద్దేశిస్తూ జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొద్ది కాలంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ హై కమాండ్ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.

కొద్ది నెలల క్రితం జీవన్ రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్య జరిగిన నేపథ్యంలో నిరసన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ‘మీకు మీ పార్టీకి ఓ దండం’అంటూ విప్ లక్ష్మణ్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుండి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Next Story

Most Viewed