Dhanush: ‘కుబేర’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ధనుష్ మాస్ స్టెప్‌తో అంచనాలను పెంచిన మేకర్స్

by Hamsa |
Dhanush: ‘కుబేర’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ధనుష్ మాస్ స్టెప్‌తో అంచనాలను పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) హీరోగానే కాకుండా డైరెక్టర్‌గానూ రాణిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తెలుగు, తమిళ అని భాషతో తేడా లేకుండా భారీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna),రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న విడుదల కాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘కుబేర’(Kubera) నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు కావడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ పాట ప్రోమో ఏప్రిల్ 15న రానుండగా.. ఫుల్ సాంగ్ ఏప్రిల్ 20న విడుదల కానున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ధనుష్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో ఆయన ఏదో జాతరలో ఉండగా.. చేతి వేళ్లు నోట్లో పెట్టుకుని మాస్ స్టెప్ వేస్తున్నట్లుగా కనిపించారు. చుట్టూ జనం ఉండగా.. ఆయన మాత్రం సోలోగా డ్యాన్స్ చేస్తున్న లుక్‌లో ఉన్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ‘కుబేర’ ఫస్ట్ సింగిల్‌పై అంచనాలను పెంచుతోంది. కాగా.. ధనుష్ ఈ సినిమాతో పాటు ఇడ్లీ కడై, శేఖర్ కమ్ములతో మరో మూవీ చేయనున్నారు. అంతేకాకుండా ధనుష్ హిట్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే అది ధనుష్-55 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్నట్లు టాక్.

Next Story

Most Viewed