- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు దుర్మార్గం : హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్ : మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దుర్మార్గమైన చర్య అని..దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని టి.హరీష్ రావు(Harish Rao) తెలిపారు. వరుస ఫుడ్ పాయిజన్(Food poisoning) ఘటనలు జరుగుతున్న మాగనూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో బీఆరెఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారని.. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయమని ఎక్స్ లో ప్రశ్నించారు. పురుగులన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లైనా లేదా? విద్యార్దులకు మంచి భోజనం కూడా పెట్టని దీన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? అని నిలదీశారు.
ప్రభుత్వం అప్రజ్యస్వామిక విధానాలు విడనాడాలని, అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బీఆర్ ఎస్ నాయకులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదని..ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండని హితవు పలికారు.