- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra : మహారాష్ట్రలో సీఎం పదవిపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహయుతి కూటమి ఫలితాలు వెలువడి 4 రోజులు దాటినా కొత్త ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం తడబడుతోంది. నవంబర్ 26వ తేదీకే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తి కాగా కూటమిలోని బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీల మధ్య సీఎం పదవిపై నెలకొన్న పీటముడి వీడకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోంది. సీఎం ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్ఠంభన కారణంగా డిసెంబర్ 2వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే ఇద్దరూ పట్టుబడుతుండటంతో.. ఎవరికి ముందుగా సీఎం పదవి ఇవ్వాలన్నదానిపై బీజేపీ అధిష్టానం ఎటు తెల్చుకోలేకపోతోంది. మంగళవారంతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తి కావడంతో రాజ్యాంగ సంక్షోభ నివారణకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. అదే జరిగితే డిసెంబర్ 2వ తేదీన మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని కూటమి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే.. అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలపై ఎలక్షన్ కమిషన్ పబ్లికేషన్‌తో 15వ అసెంబ్లీ ఏర్పాటు అయిందని.. ఇప్పటికిప్పుడు వచ్చే న్యాయపరమైన సమస్యలేమీ ఉండవంటున్నారు.
సీఎం పదవిపై ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండేల మధ్య పోటీ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం పదవిని ఫడ్నవిస్, షిండేలు చెరో రెండున్నర ఏండ్ల పాటు నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా వినిపించింది. అలా జరిగినా మొదటి రెండున్నర ఏండ్ల సీఎం ఎవరన్నదానిపై ఇరువర్గాలు వెనక్కి తగ్గకపోవచ్చు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించి.. తిరిగి అధికారం చేపట్టడానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వమే కారణం అని సీఎం పదవిని ఆయనకే ఇవ్వాలని షిండే శివసేన పార్టీ వాదిస్తుంది. బీజేపీ నేతలు మాత్రం సీఎం పదవి దేవేంద్ర ఫడ్నవీస్‌కే అప్పగించాలని పట్టుబడుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 132 సీట్లు గెలుచుకోవడంలో ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారని.. అందుకే సీఎం పదవిని ఆయనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు.