- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉరి వేసుకున్న యువకుడు.. సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్..
దిశ, జగదేవపూర్ : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన వంటేరు సందీప్ రెడ్డి అనే యువకుడు ఆర్థిక సమస్యలతో మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. నమ్మదగిన సమాచారం మేరకు జగదేవపూర్ బ్లూ కోట్ కానిస్టేబుల్ లింగం లొకేషన్ ద్వారా సందీప్ రెడ్డి ఇంటికి వెళ్లి ఉరి వేసుకున్న గది తలుపులు పగులగొట్టి యువకుని కిందకు దించాడు. ఉరి వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సందీప్ రెడ్డికి వెంటనే సీపీఆర్ చేశాడు.
యువకునికి స్పృహ రాగానే గజ్వేల్ ఆసుపత్రికి పంపించారు. గజ్వేల్ హాస్పిటల్ లో సందీప్ రెడ్డికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న సందీప్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉంది. సిపిఆర్ చేసి యువకుని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ లింగంను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ, ఏసీపీ పురుషోత్తం, యువకుని కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.