- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారిని వెంటనే సస్పెండ్ చేయండి
దిశ, మేడ్చల్ టౌన్ : అందుబాటులో లేని ఆ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడింగ్ చేస్తున్న ఆపరేటర్ పక్కన అందుబాటులో లేని ఇద్దరు ఎన్యుమరేటర్లను వెంటనే సస్పెండ్ చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే వివరాల ఆన్ లైన్ అప్ లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు లేకుండా సర్వే వివరాలను అప్ లోడ్ చేస్తున్న ఆపరేటర్లను గమనించిన కలెక్టర్ సంబంధిత ఎన్యుమరేటర్లను వెంటనే సస్పెండ్ చేయాలని మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ్యకంగా నిర్వహిస్తున్న సర్వేలో ఎలాంటి పొరపాట్లను సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేటర్లు కేవలం ఆన్ లైన్ లో ఆప్ లోడ్ చేయడం వరకే బాధ్యతని, తప్పులు జరిగితే ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు పక్కన ఉన్నంత సేపు మాత్రమే ఆపరేటర్లు సర్వే వివరాలు అప్ లోడ్ చేయాలని సూచించారు. సమయం వృథా కాకుండా ఎన్యుమరేటర్లు, ఆపరేటర్లు ఒకే సమయంలో భోజనం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో ఆన్ లైన్ లో అప్లోడ్ చేయించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ తహసీల్దారు శైలజ, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఎంపీడీఓ సంపూర్ణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.