సీఎస్ఆర్ నిధులను వైద్యం, విద్యకు కేటాయించాలి : రంగారెడ్డి అదనపు కలెక్టర్

by Aamani |
సీఎస్ఆర్ నిధులను వైద్యం, విద్యకు  కేటాయించాలి : రంగారెడ్డి అదనపు కలెక్టర్
X

దిశ,రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో ఆరోగ్యం, విద్య కోసం సీఎస్ఆర్ కింద సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ప్రధాన పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ సీఎస్ఆర్ కింద సహకారం పై ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యం,విద్య కోసం అన్ని పరిశ్రమలు సీఎస్ఆర్ కింద సహకరించాలని అన్నారు.

పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయలు, ఫర్నిచర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఆసుపత్రులలో అవసరమైన వసతులు కల్పించాలని తెలిపారు. ఇప్పటికే వివిధ రంగాల్లో సీఎస్ఆర్ కింద సహకారం అందిస్తున్న పారిశ్రామికవేత్తల అందరినీ అదనపు కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, ప్రధాన పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story