- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 27: సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు అందించే భోజనం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిర్దేశిత మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అంగన్వాడి సెంటర్ ను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టోర్ రూమ్ లో నిల్వ చేసిన పదార్థాలను పరిశీలించారు. భోజనం తయారీ కోసం నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగించాలని, కాలం చెల్లిన, నాసిరకం పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని హితవు పలికారు. వంటలు తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. భోజనం వండేందుకు వినియోగిస్తున్న ప్రతి ఆహార పదార్థాన్ని అనునిత్యం విధిగా పరిశీలించాలని అన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.