అనంతపురం జిల్లాలో ఆవుదూడను వేటాడిన చిరుత.. ఆందోళనలో రైతులు

by srinivas |   ( Updated:2024-11-27 17:12:38.0  )
అనంతపురం జిల్లాలో ఆవుదూడను వేటాడిన చిరుత.. ఆందోళనలో రైతులు
X

దిశ, వెబ్ డెస్క్: చిరుత(Cheetah) దాడిలో ఆవు దూడ(cow calf) మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా(Anantapur District) గూబనపల్లి(Gubanapalli)లో జరిగింది. కొద్దిరోజులుగా గూబనపల్లిలో చిరుత సంచారిస్తోంది. స్థానిక అటవీప్రాంతం నుంచి చిరుత రాత్రి సమయంలో గూబనపల్లి సమీపంలో తిరుగుతోంది. జంతువులపై దాడి చేస్తోంది. తాజాగా తిమ్మరాజు అనే రైతుకు చెందిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఆవు దూడ మృతి చెందింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచరించి ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. రాత్రి సమయంలో గూబనపల్లి వాసులు బయట తిరగొద్దని అధికారులు సూచించారు. పొలాలకు వెళ్లే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చిరుత సంచారంతో గూబనపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. త్వరగా చిరుతను బంధించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed