ఈహెచ్ఎస్ పై దృష్టి సారిస్తాం: మంత్రి దామోదర

by Mahesh |
ఈహెచ్ఎస్ పై దృష్టి సారిస్తాం: మంత్రి దామోదర
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈ హెచ్ ఎస్ ), ఉద్యోగుల సహకారం పై ప్రభుత్వం దృష్టి సారించిదని టీజీవోఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. టీజీఓల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ ఆధ్వర్యంలో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను బుధవారం కలిశారు. డిసెంబర్ 5, 2024 తర్వాత రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ఉద్యోగుల సంఘాలతో ఈ విషయాన్ని వివరంగా చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ టిజీవో నేతలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతినిధి బృందంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ గౌడ్, శ్రీరామ్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed