Noida: నోయిడా ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద ఘటనలో యజమానిపై కేసు నమోదు

by S Gopi |
Noida: నోయిడా ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద ఘటనలో యజమానిపై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: గ్రేటర్ నోయిడాలోని సోఫా తయారీ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు బుధవారం ప్రకటనలో వెల్లడించారు. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐదు అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(జోన్3) అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారు గుల్ఫామ్, మజర్ ఆలం, దిల్షాద్‌లుగా గుర్తించామని, విచారణలో కొవిడ్-19 సమయం నుంచి ఫ్యాక్టరీ మూసివేసినట్టు పోలీసులు కనుగొన్నారు. సోఫాల మరమ్మతుల కోసం ఫ్యాక్టరీ యాజమాన్యం బాధితులకు కొంత స్థలాన్ని కేటాయించింది. అయితే, నిర్లక్ష్యం కారణంగా మంటలు చెలరేగి ముగ్గురూ మరణించినట్టు గుర్తించారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యంపై గల్ఫాం బావమరిది కేసు నమోదు చేశాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, ఫ్యాక్టరీ యజమాని సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణమని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed