- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి.. కొప్పుల వేణారెడ్డి..

దిశ, చివ్వేంల : కుడకుడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్దుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణు రెడ్డి అన్నారు. కుడకుడ ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్దులకు సువెన్ ఫార్మా, అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఉదయం జరిగిన నోట్ పుస్తకాలు, పరీక్ష ఫ్యాడ్ ల పంపిణీ కార్యక్రమంలో కొప్పుల వేణు రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సువెన్ ఫార్మా, అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్, పరీక్ష ప్యాడ్ లు, షూస్, టై బెల్ట్ అందజేయడం హర్షణీయమని అన్నారు. స్ధానిక కుడకుడ గ్రామంలోని పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. నేడు విద్య, వైద్యం ఖర్చులు పెరిగి మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి ఫీజుల సమస్యలు లేకుండా ఉత్తీర్ణత కలిగిన ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారని, కావున పేద మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు.
కుడకుడ ప్రభుత్వ పాఠశాల నందు గ్రౌండ్, టాయిలెట్ ల నిర్మాణం చేయడానికి మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఇటీవల మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని కలిసినప్పుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ నిధులు కేటాయించాలని కోరడం జరిగిందని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ఎమ్మెల్సీ, ఎంపీ నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట గదిని ఆయన పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, స్ధానిక మాజీ కౌన్సిలర్ వేములకొండ పద్మ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఆలేటి మాణిక్యం, సువెన్ ఫార్మా హెచ్ ఆర్ హెడ్ వెంకటరమణ, పీఆర్ వో సైదులు, అక్షర రాంరెడ్డి, కాళిదాసు, పాఠశాల ఇంచార్జ్ హెచ్ ఎమ్ కవిత తదితరులు పాల్గొన్నారు.