త్రాగునీటిలో డ్రైనేజీ నీరు..

by Kalyani |
త్రాగునీటిలో డ్రైనేజీ నీరు..
X

దిశ, చైతన్య పురి : కొత్తపేట డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ ఫేస్ 2లో త్రాగునీటిలో డ్రైనేజ్, మురికి నీరు కలుషితం అవుతుందడంతో కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి సమస్యను పరిశీలించారు. అనంతరం జలమండలి అధికారులతో మాట్లాడి రాజీవ్ గాంధీ నగర్ లో కలుషిత నీటి సమస్యను వెంటనే పరిశీలించాలని, కలుషిత నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీ వాసులకు త్రాగడానికి మంచి నీటి ట్యాంకర్ పంపించాలని ఏఈ స్రవంతి కి సూచించారు. వారు వెంటనే స్పందించి మురుగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Next Story

Most Viewed