- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో వాదనలు షురూ.. సుప్రీం ధర్మాసనం షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తరఫున గెలిచి కాంగ్రెస్ (Congress)లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టు (Supreme Court)లో మరోసారి విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai), ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌ల (Justice Augustine George Masihla) ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. అయితే, కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ (BRS) తరఫున ఆర్యమా సుందరం (Aryama Sundaram) వాదనలు వినిపించగా.. అసెంబ్లీ సెక్రటరీ (Assembly Secretary) తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలు బెంచ్‌కు వినిపిస్తున్నారు.
కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందేనని అన్నారు. స్పీకర్‌కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ (High Court Single Bench) తీర్పు సరికాదని వాదించారు. స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు జోక్యంపై ఆయన అభ్యతరం వ్యక్తం చేయగా.. జస్టిస్ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఇక న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని కామెంట్ చేశారు. ఇదివరకు కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోర్టులో నిలబెట్టామనే విషయాన్ని మర్చిపొవొద్దని అన్నారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు రాజ్యాంగంలో షెడ్యూల్-10, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు.