- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Technology : పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నా డోంట్ వర్రీ.. స్మార్ట్ ట్రాన్స్‌ఫర్ బెడ్స్ కూడా వచ్చేశాయ్‌గా.. (video)

దిశ, ఫీచర్స్ : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు అనారోగ్యాలు తలెత్తడం సహజం. ముఖ్యంగా ఇలాంటప్పుడు వృద్ధులు పైకిలేవలేని పరిస్థితిలో ఉంటారు. యుక్త వయస్కులైనా సరే, తీవ్రమైన అనారోగ్యాలు, శస్త్ర చికిత్సల సందర్భంగా ఆస్పత్రుల్లో మంచానికి పరిమితం అవుతుంటారు. ఇక అక్కడ ఉన్నన్ని రోజులు పేషెంట్స్ పడుకొని ఉండే మంచంపైన బెడ్‌షిట్లను మార్చడం, రోగులనే ఇతర బెడ్స్‌పైకి చేర్చడం వంటి అవసరాలు ఏర్పడతాయి. ఈ సందర్భంగా శారీరక నొప్పితో, లేవలేని, నడవలేని పరిస్థితితో బాధితులు అవస్థలు పడుతుంటారు. కానీ ఇక నుంచి అటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే చైనీస్ టెక్ నిపుణులు స్మార్ట్ ట్రాన్స్‌ఫర్ బెడ్స్‌ను రూపొందించారు.
స్మార్ట్ ట్రాన్స్‌ఫర్ బెడ్స్ అంటే?
ఆస్పత్రుల్లో మంచానికే పరిమితమైన రోగులను ఒక బెడ్ నుంచి మరో బెడ్‌కు మార్చడానికి ఉపయోగించే అధునాతన విద్యుత్ ఆధారిత పరికరాలే(Advanced electrical equipment)స్మార్ట్ ట్రాన్స్‌ఫర్ బెడ్స్. ఇవి ఎలక్ట్రిక్ మోటార్లు, స్లైడ్ బోర్డులు, హైడ్రాలిక్ సిస్టమ్స్, డిజిటల్ కంట్రోలింగ్ సిస్టమ్స్‌తో అమర్చబడి ఉంటాయి. రోగులకు ఇబ్బందులు లేకుండా, సౌకర్యవంతంగా షిఫ్ట్ చేయడానికి సహాయపడతాయి. ఈ సందర్భంగా పేషెంట్లలో శారీరక నొప్పి, ఒత్తిడి వంటి ప్రాబ్లమ్స్ తలెత్తవు. పైగా సహాయకుల అవసరం కూడా ఉండదు.
ఎవరు కనుగొన్నారు?
మోడ్రన్ టెక్నాలజీలో, సరికొత్త ఆవిష్కరణల్లో చైనా ఎంత ముందున్నదో తెలిసిందే. రోగులను ఒక బెడ్ నుంచి మరో బెడ్‌పైకి షిఫ్ట్ చేసేందుకు అవసరమైన స్మార్ట్ ట్రాన్స్‌ఫర్‌బెడ్స్‌ను కూడా చైనానే ఆవిష్కరించింది. ఈ దేశానికి చెందిన Xiamen Sun Lion Technology Co., Ltd. అనే ప్రముఖ వైద్య పరికరాల తయారీ కంపెనీ రూపొందించింది. మరొక కంపెనీ ‘Shanghai Pinxing Medical Equipment Co., Ltd.’ కూడా హైడ్రాలిక్ ట్రాన్స్‌పోర్ట్ స్ట్రెచర్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది.
ప్రయోజనాలు ఇవే..
స్మార్ట్ ట్రాన్స్‌ఫర్ బెడ్స్ ఆవిష్కరణ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్పత్రుల్లో రోగులను ఒక బెడ్‌పై నుంచి మరో బెడ్‌పైకి, అలాగే ఒక వార్డు నుంచి మరో వార్డుకు షిఫ్ట్ చేయడానికి సహాయకుల అవసరం, వారికి, అలాగే రోగులకు ఇబ్బంది తప్పుతుంది. ఒక బటన్ నొక్కితే చాలు. ఒక మంచం నుంచి మరో మంచానికి రోగి ఆటోమేటిగ్‌గా రోగి చేంజ్ అవుతారు. పైగా ఈ సందర్భంలో నొప్పి, గాయాలు వంటి సమస్యలు ఉండవు. అప్పటికే నొప్పితో బాధపడేవారికి, పైకిలేవలేని స్థితిలో ఉన్నవారికి ఇది మరింత కంఫర్ట్‌గా ఉంటుంది.