- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జీవీ ప్రకాష్‌తో డేటింగ్‌పై స్పందించిన దివ్యభారతి.. ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ సంచలన పోస్ట్

దిశ, సినిమా: కోలీవుడ్ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస అవకాశాలు అందుకుంటూనే పలు చిత్రాల్లో కీలక పాత్రలోనూ నటిస్తున్నారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన కెరీర్ పీక్స్‌లో ఉండగానే సింగర్ సైంధవి(Saindhavi)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కానీ ఇంకా వీరిద్దరికి డైవర్స్ మంజూరు చేయకపోవడంతో ఇద్దరు కలిసే కోర్టుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి జీవీ ప్రకాష్ కుమార్ యంగ్ హీరోయిన్ దివ్య భారతి(Divya Bharathi)తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అందుకే సైంధవికి విడాకులు ఇచ్చాడనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంపై వీరిద్దరు స్పందించినప్పటికీ డేటింగ్ వార్తలకు చెక్ పడటం లేదు. నిత్యం ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, హీరోయిన్ దివ్యభారతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ఈ మేరకు ఓ సంచలన పోస్ట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చింది. ‘‘నాకు సంబంధం లేని వ్యక్తుల కుటుంబ విషయాల్లోకి నా పేరును లాగుతున్నారు. జీవీ ప్రకాష్ కుటుంబ సమస్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను. ముఖ్యంగా పెళ్లి అయిన వ్యక్తితో డేటింగ్ చేయను. దయచేసి ఆధారాలు లేకుండా రూమర్స్ సృష్టించకండి.
నేను ఈ విషయంలో ఇప్పటివరకూ మౌనంగా ఉన్నాను. అయితే కొన్ని రోజుల నుంచి ఈ రూమర్స్ హద్దులు దాటుతున్నాయి. ఈ గాసిప్‌ల కారణంగా నా పేరు దెబ్బతింటోంది. కాబట్టి నేను ఇప్పుడు స్పందిస్తున్నాను. ఇలాంటి నిరాధారమైన వార్తలు సృష్టించే బదులు సమాజానికి ఉపయేగపడే పనులు చేయండి. నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి. ఈ అంశంపై ఇదే నా మొదటి.. చివరి ప్రకటన’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం దివ్యభారతి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా సైలెంట్‌గా ఉంటున్నా అంటూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు. కొంతమంది ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.